ETV Bharat / state

'నేను ఎన్టీఆర్​ గురించి తప్పుగా మాట్లాడలేదు' - మరో వీడియో రిలీజ్​ చేసిన కౌశిక్ తల్లి - ACTOR NTR PAID RUPEES 12 LAKHS

మీడియా ఎదుట తప్పుగా మాట్లాడలేదన్న కౌశిక్​ తల్లి - ఆమె ఎన్టీఆర్​పై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్​ - కుటుంబసభ్యులంతా ఎన్టీఆర్​ అభిమానులేనని వ్యాఖ్య

NTR FAN KOUSHIK
NTR PAID HOSPITAL BILLS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2024, 1:37 PM IST

NTR Paid a Bill of 12 lakhs in Hospital to his Fan : ‘ఎన్టీఆర్‌ గారు నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చా. మా కుటుంబసభ్యులంతా మీకు అభిమానులే’ అని సరస్వతి అనే మహిళ తెలిపారు. తన కుమారుడు కౌశిక్‌ ట్రీట్​మెంట్​కు ఆసుపత్రిలో అయిన ఖర్చును భరించిన జూనియర్​ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం (డిసెంబరు 23) మీడియా ముందుకొచ్చి సరస్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తన కుమారుడు కౌశిక్​ డిశ్చార్జ్‌ అనంతరం ఆమె తాజాగా మరోసారి మాట్లాడారు.

"మంగళవారం సాయంత్రం జూనియర్​ ఎన్టీఆర్‌​ సిబ్బంది నుంచి నాకు ఫోన్​ వచ్చింది. మేం వస్తున్నాం కౌశిక్​ను డిశ్చార్జ్‌ చేయిస్తామని చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ.12 లక్షల బిల్లు కట్టి, నా కుమారుడిని డిశ్చార్జ్‌ చేయించారు. తన ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. నిన్న నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్‌ అభిమానులు కాస్త ఫీలైనట్లు ఉన్నారు. మీరు అపార్థం చేసుకోవద్దు. మీ అందరి ఆశీర్వాదం వల్లే నా కొడుకు ఈ రోజు బాగున్నాడు". అని ఆమె పేర్కొన్నారు.

వీడియో కాల్​ చేసిన ఎన్టీఆర్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కౌశిక్‌ (19) గత కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు జూనియర్​ ఎన్టీఆర్‌ వీరాభిమాని. దీంతో చనిపోయేలోపు ‘దేవర’ సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు 2024 సెప్టెంబరులో చెప్పారు. తన కుమారుడి వైద్యానికి దాదాపు రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కౌశిక్‌ తల్లి మీడియా ఎదుట దుఃఖంతో కోరారు. సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జూనియర్​ ఎన్టీఆర్‌, కౌశిక్‌కు స్వయంగా వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. అతడికి కొంత సేపు ధైర్యం చెప్పారు. ముందు ఆరోగ్యం తర్వాతే సినిమా అని, త్వరగా కోలుకోవాలని కోరారు.

శ్రీతేజ్​కు రూ.50లక్షల చెక్కు అందించిన మైత్రీ మూవీస్ - అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన కోమటిరెడ్డి

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్‌ - రేవతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.