Pushpa 2 Stampede Case : సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవపట్టించే పోస్టులను గుర్తించిన పోలీసులు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు శాఖను అప్రతిష్ఠపాలు చేసే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై సామాజిక మాధ్యమాల్లో సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసు శాఖను బద్నాం చేసేలా : సినీ నటుడు అల్లుఅర్జున్ రాకముందే సంథ్య థియేటర్లో తొక్కిసలాట జరిగినట్లు తప్పుడు వీడియోలను కొందరు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ చేసిన క్రమంలో తెలిసిన నిజాలను ఇప్పటికే వీడియో రూపంలో విడుదల చేసినట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్ట్‌లు పెడితే, దాని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఎవరి దగ్గరైన ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే తమకు అందించవచ్చని పోలీసులు కోరారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
— Hyderabad City Police (@hydcitypolice) December 25, 2024
అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు …. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది.
ఈ ఘటన పై విచారణ…
ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు : ''సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తాం. కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం'' అని హైదరాబాద్ పోలీసులు ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
'రేవతి చనిపోయిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు' - పోలీసుల విచారణలో అల్లుఅర్జున్ భావోద్వేగం
అల్లు అర్జున్‌పై కేసు వెనక్కి తీసుకుంటాను : శ్రీతేజ్ తండ్రి భాస్కర్