భద్రాద్రి రాముల వారి ఆభరణాల లెక్కింపు - భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం
🎬 Watch Now: Feature Video
Published : Nov 7, 2023, 3:05 PM IST
Bhadradri Temple Gold And Sliver Jewellery Counting : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించిన ఆభరణాలను ఆలయ అధికారులు లెక్కిస్తున్నారు. గతంలో ఉన్నవి, ప్రస్తుతం వచ్చినవి అన్ని కలిపి ఆభరణాలను కొలతలు వేసి, లెక్కింపు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం బంగారు ఆభరణాల మదింపు నిర్వహించి అధికారులు భద్రపరిచారు. ఇప్పుడు స్వామి వారికి భక్తులు కొత్తగా సమర్పించిన బంగారు, వెండి, ఇతర ఆభరణాలను ఆలయ అధికారులు లెక్కిస్తున్నారు.
భద్రాద్రి రామయ్య వద్ద ఇప్పటివరకు మొత్తం 65 కేజీల బంగారు, 978 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. గత రెండు నెలల నుంచి భక్తులు మెక్కులుగా సమర్పించిన ఒక్కొక్క ఆభరణాన్ని విడిగా పరిశీలించి తూకం వేసి లెక్కింపు చేస్తున్నారు. అన్ని ఆభరణాలను లెక్కించిన తర్వాత వాటి లెక్కలు నమోదు చేసి స్వామివారి ఆభరణాలను భద్రపరచనున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు.