ప్రయాణిస్తుండగానే బైక్‌లో చెలరేగిన మంటలు.. రైడర్ సజీవదహనం - కర్ణాటక బెంగళూరు బైక్ పెట్రోల్ ట్యాంక్
🎬 Watch Now: Feature Video
BENGALURU BIKE ACCIDENT: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగడం వల్ల ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. మండ్యలోని పాండవపుర వద్ద తన ద్విచక్ర వాహనంపై శివరాముడు మరో వ్యక్తితో కలిసి వెళ్తున్నాడు. దసరగుల్పె గ్రామం వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తుండగానే మంటలు రావడం వల్ల వేగంగా మంటలు మనుషులకూ వ్యాపించాయి. క్షణాల్లో అలుముకున్న మంటలతో శివరాముడు మృతి చెందగా... మరో వ్యక్తి కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెట్రోల్ ట్యాంకు లీక్ కావడంతోనే ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరణించిన శివరాముడు మంటలు అంటుకుని ఆర్తనాదాలు పెట్టగా.. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST