తేనె కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎలుగుబంట్లు - ఛత్తీస్గఢ్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్గఢ్ కొరియా జిల్లాలోని కాంకేర్లో ఎలుగుబంట్లు హల్చల్ సృష్టించాయి. వాటర్ ట్యాంక్పై ఉన్న తేనె పట్టును గమనించిన మూడు భల్లూకాలు.. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాయి. తేనె పట్టుపై దాడి చేయగా తేనెటీగలు పట్టును విడిచిపెట్టి వెళ్లిపోయాయి. తర్వాత ఎలుగుబంట్లు తేనెను తాగేశాయి. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు మొబైల్లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి స్థానికులు ఇళ్లలోకి వెళ్లిపోయారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST