Bathukamma Sarees Distribution In Telangana : తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ - రంగారెడ్డిలో బతుకమ్మ చీరల పంపిణీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-10-2023/640-480-19680415-thumbnail-16x9-bathukamma-sarees.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 4, 2023, 5:49 PM IST
Bathukamma Sarees Distribution In Telangana : హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ సందడి నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడలో మహిళలకు బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు . రాష్ట్రంలో ఆడపడుచుల ఆత్మగౌరవం పెంచడమే బతుకమ్మ చీరల పంపిణీ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఆదిలాబాద్‌లో బతుకమ్మ చీరల పంపిణీకి రణదివేనగర్‌లో మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ శ్రీకారం చుట్టారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడవారికి ఈ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతీ ఏడాది బతుకమ్మ చీరలను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆడపడుచులకు బట్టలు అందిస్తూ గౌరవప్రదంగా చూస్తున్నారనీ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి చీరల పంపిణీ చేశారు. ఐటీడీఏ నుంచి తండాలకు రహదారుల కోసం రూ.150 కోట్లు విడుదల చేశారని హర్షం వ్యక్తంచేశారు.