అతివేగంతో కారు ఢీ - సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు - banjarahills car accident
🎬 Watch Now: Feature Video
Published : Jan 18, 2024, 7:14 PM IST
Banjarahills CCTV Viral Video : సంక్రాంతి పండుగ సందర్భంగా నగర వాసులు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి. ఇంకేముంది, పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్‌లకు పని చెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1 నుంచి బీఎండబ్ల్యూ కారులో ఓ యువకుడు మితిమీరిన వేగంతో, భారీ శబ్దంతో దూసుకెళ్లి గోడకు ఢీ కొట్టాడు. దీంతో కారు ముందు భాగం చాలావరకు ధ్వంసమైంది.
Banjarahills CCTV Viral Video : ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకొని కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు. వ్యక్తికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.