Bandi Sanjay Fires on BRS : ఒక వర్గానికే కొమ్ము కాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బండి సంజయ్ - Bandi Sanjay Bhumipooja
🎬 Watch Now: Feature Video
Published : Oct 4, 2023, 4:49 PM IST
Bandi Sanjay Fires on BRS : అధికార బీఆర్ఎస్ పార్టీ హిందూ మనోభావాలను దెబ్బ తీస్తూ ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కచ్చితంగా మందలిస్తామని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ శివారులో ఓ వర్గం వారికి ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించడంపై తప్పు పట్టారు. సదరు వర్గానికి ప్రభుత్వం కేటాయించిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay in Karimnagar Today : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న హిందూ దేవాలయాలను పట్టించుకోకుండా.. ప్రభుత్వము కేవలం ఒకరికి మాత్రమే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో గురుద్వార్, మేదరి సంఘం కమ్యూనిటీ భవనాన నిర్మాణానికి భూమి పూజ చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తే కచ్చితంగా మాట్లాడవలసి తీరుతుందని, తగిన గుణపాఠం చెబుతామని అధికార పార్టీ నాయకులను హెచ్చరించారు