'కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రులే - వారివి మాత్రం ఆరు గ్యారెంటీలట' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 20, 2023, 7:59 PM IST
Bandi Sanjay Election Campaign in Adilabad : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరును ముమ్మరం చేసింది. ఓవైపు బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్ర మంత్రులతో ప్రచారాలు చేయిస్తూనే.. మరోవైపు స్థానిక నేతలతో రోడ్ షోలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిర్వహించిన రోడ్ షోలో.. ఆ పార్టీ అగ్రనేత బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో వచ్చిన ఆయన.. రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో సంజయ్ విరుచుకుపడ్డారు. హస్తం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్లోకి వెళ్లరని గ్యారెంటీ ఇవ్వమంటే.. దానికి మాత్రం గ్యారెంటీ లేదు కానీ.. ఆరు గ్యారెంటీలను వివరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం మరో సభకు వెళ్లాల్సి ఉందని, పూర్తి రోడ్‌షోలో పాల్గొనకుండానే వెనుదిరగడం పార్టీశ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపించినా.. ఉన్న కొద్దిసేపు తన ప్రసంగంతో శ్రేణుల్లో జోష్ నింపారు. అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు.