కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే కచ్చితంగా ఉపఎన్నిక వస్తుంది : బండి సంజయ్ - బండి సంజయ్ కామెంట్స్ ఆన్ కేటీఆర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-11-2023/640-480-20000395-thumbnail-16x9-bandi-sanjay.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 11, 2023, 2:20 PM IST
Bandi Sanjay Comments on BRS : ఎన్నికల తర్వాత కేసీఆర్ కచ్చితంగా.. కేటీఆర్‌ను సీఎం చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలో ఏది గెలిచినా.. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఉపఎన్నికలు కచ్చితంగా వస్తాయని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను పెట్టి.. డబ్బులు పంచినా కేవలం 10 వేల ఓట్లు ఆధిక్యంతోనే బీఆర్ఎస్ గెలిచిందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అసలు గెలిచే అవకాశం లేదని.. ఆ పార్టీ పోటీకే రాదని నాయకులు అన్న విషయాలను బండి సంజయ్ గుర్తు చేశారు. వారు అనుకున్నదానికి వ్యతిరేకంగా బీజేపీ గెలిచి చూపించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనను చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతూ బీజేపీని గెలిపిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు.