డ్రైవర్ నిర్లక్ష్యం.. రివర్స్ చేస్తుండగా బాలుడిపైకి వెళ్లిన కారు - తమిళనాడు కారు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కారు రివర్స్ చేస్తూ.. బాలుడిపైకి ఎక్కించాడో వ్యక్తి. రెండుసార్లు బాలుడిపై నుంచి వెళ్లటం వల్ల తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు ఆ బాలుడు. రాసిపురమ్ గ్రామానికి చెందిన కన్నన్ కుమారుడు తరుణ్(2) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. పొరుగింటిలో ఉండే వ్యక్తి బయటకు వెళ్లేందుకు కారును తీశాడు. రివర్స్ చేస్తుండగా బాలుడు అక్కడికి వచ్చాడు. చిన్నారిని చూసుకోకుండా కారును వెనక్కి తీసుకురావటం వల్ల బాలుడిపైకి వెనక చక్రం ఎక్కింది. అయినప్పటికీ గమనించకుండా మరోమారు ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST