బాబు మోహన్​కు భారీ షాక్ - బీఆర్​ఎస్ తీర్థం పుచ్చుకున్న కుమారుడు ఉదయ్​ మోహన్ - ఉదయ్‌ మోహన్‌ ఏ పార్టీలో చేరారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 1:39 PM IST

Babu Mohan son Uday Mohan joined BRS : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారటం పరిపాటిగా మారింది. తమ ఆశయాలకు అనుకూలంగా ఉండే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా బీజేపీ సీనియర్​ నేత బాబు మోహన్​ కుమారుడు ఆ లిస్టులోకి చేరారు. సంగారెడ్డి జిల్లా ఆంధోల్​లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్(Babu Mohan)​కు భారీ షాక్‌ తగిలింది. ఆయన కుమారుడు ఉదయ్‌ మోహన్‌ సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. 

Telangana Assembly Elections 2023 : ఉదయ్‌ మోహన్(Uday Mohan)​కు మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో బాబుమోహన్ వ్యవహార శైలి నచ్చకే బీఆర్ఎస్​లో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయ్‌ మోహన్‌తో పాటు ఆంధోల్​లోని పలువురు ముఖ్య నాయకులూ బీఆర్ఎస్​లో చేరారు. బీజేపీలో ఉండి దామోదర్​కు సపోర్ట్ చేయమని బాబు మోహన్ చెప్పడాన్ని జీర్ణించుకోలేక పోయామని క్యాడర్ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.