రామభక్తిని చాటుకున్న స్వర్ణకారుడు- బంగారంతో అయోధ్య రామమందిర నమూనా తయారీ - Golden Ayodhya Mandir nagarkurnool
🎬 Watch Now: Feature Video
Published : Jan 19, 2024, 5:06 PM IST
Ayodhya Ram Mandir Replica Made with Gold in Amrabad : ఈనెల 22న జరిగే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బంగారంతో రామ మందిరాన్ని తయారుచేసి తన భక్తిని చాటుకున్నాడు ఓ యువ స్వర్ణ కారుడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కేవలం 1.5 సెంమీ ఎత్తు, 1.75 సెంమీ వెడల్పు, 2.75 సెంమీ పొడవు మొత్తం 2.730 మిల్లి గ్రాములతో బంగారు భవ్య రామ మందిరాన్ని తయారు చేశాడు.
Golden Ayodhya Ram Mandir : ఈ రామమందిరంలో 20 గోపురాలు, 108 పిల్లర్లు, విల్లును తయారు చేసి తన ప్రతిభను చాటాడు. తను తయారు చేసిన ఈ కళా ఖండాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద ప్రదర్శించాలని కోరిక ఉందని స్వర్ణ కారుడు గోపి చారి తెలిపారు. గతంలోనూ గోపి చారి ఎన్నో సూక్ష్మ కళాఖండాలను తయారు చేసాడు. తన ప్రతిభతో నల్లమల్ల ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న గోపికి స్థానికులు అభినందించారు.