Auto Driver Killed by Falling Tree Live Video : ఆటోలపై కుప్పకూలిన భారీ వృక్షం.. డ్రైవర్ మృతి - Corporator Mahalakshmi Raman Goud Respond
🎬 Watch Now: Feature Video


Published : Sep 2, 2023, 3:57 PM IST
Auto Driver Killed by Falling Tree Live Video in Hyderabad : ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షం కూలిపోవడంతో.. దాని కింద పడి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సోమజిగూడా ఎమ్ఎస్ మక్త ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ గౌస్ పాషా.. హిమాయత్ నగర్ నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్తున్నాడు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో డ్రైవర్ ఆటోను నిలిపాడు. ఇదే సమయంలో పక్కనే ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షం(Huge Tree) ఒక్కసారిగా కూలి నేరుగా ఆటోలపై పడింది. వృక్షం మీద పడటంతో ఆటోలో ఉన్న డ్రైవర్(Auto Driver) గౌస్ పాషా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పక్కనే ఉన్న మరో ఆటో ధ్వంసమైంది. ఈ ఘటన కారణంగా కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
Auto Driver Died Due to Tree at Hyderguda MLA Quarters : విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ పోలీసులు భారీ వృక్షాన్ని తొలగించారు. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు. స్థానిక హిమాయత్‌నగర్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్.. ఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి చెట్టు వేగవంతంగా తొలగించారు. హిమాయత్‌నగర్ డివిజన్లో 14 చెట్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియదని.. వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కార్పొరేటర్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని తెలిపారు.