స్టాప్​ వద్ద బస్సు ఎందుకు ఆపలేదు? - ఆర్టీసీ డ్రైవర్​పై ముగ్గురు వ్యక్తుల దాడి - ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 4:31 PM IST

Attack on RTC Bus Driver in Siddipet : బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్​పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం వెంకట్రావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్ స్టేజీ వద్ద ఓ యువతి దిగాల్సి ఉండగా, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఆగలేదు. దీంతో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వెంకట్రావుపేట వద్ద బస్సును ఓవర్​టేక్ చేశారు.  

Attack on RTC Driver in Gajwel : బస్సు ముందు ఆటోను నిలిపి విధులకు ఆటంకం కలిగించారు. అహ్మదీపూర్ వద్ద బస్సు ఎందుకు ఆపలేదని కండక్టరు రజితను దుర్భాషలాడారు. స్టాప్​ వచ్చిందని యువతిని హెచ్చరించినా, ఆమె ఎయిర్ ఫోన్స్ పెట్టుకోవడంతో దిగలేదని కండక్టర్ తెలిపారు. బస్సు డ్రైవర్ పడాల బాలేంద్రస్వామి ఈ విషయంలో జోక్యం చేసుకోగా ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో కండక్టర్ రజిత ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.