AT Home Programme in Rajbhavan : రాజ్‌భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం.. హాజరు కాని బీఆర్ఎస్, కాంగ్రెస్ - ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కాని కాంగ్రెస్
🎬 Watch Now: Feature Video
AT Home Programme in Rajbhavan : పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ నేతలెవరూ హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా పాల్గొనలేదు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, స్వాతంత్య్ర సమరయోధులు, పలువురు ప్రముఖులు గవర్నర్ ఎట్ హోంకు హాజరయ్యారు.