'ప్రధాని మోదీ నేతృత్వంలో మేమంతా కట్టుబడి ఉన్నాం' - తెలంగాణ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 8, 2023, 2:35 PM IST

ashwini vaishnav speech at Hyderabad in bjp public meeting: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. 2014 కంటే ముందు 40 నుంచి 50 వేల కోట్లతో రైల్వే బడ్జెట్‌ ఉండేదని.. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రైల్వేల కోసం ప్రధాని మోదీ 2 లక్షల 40 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. దీనివల్ల ఎంతో లబ్ధి చేకూరనుందని చెప్పారు.

'2014కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ ప్రస్తుతం ఒక్క తెలంగాణ కోసం బడ్జెట్‌లో ప్రధాని మోదీ 4 వేల 400 కోట్లు కేటాయించారు. తెలంగాణలో రైల్వే సేవల విస్తరణకు ప్రధాని మోదీ నేతృత్వంలో మేమంతా కట్టుబడి ఉన్నాం. రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాల్సి ఉంది. భూ సేకరణలో శాంతిభద్రతల సమస్య వస్తోంది. రాజకీయాలను పక్కపెట్టి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుతో తెలంగాణ ప్రజలకు వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తున్నా.' అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.