Argument between BRS and Congress leaders At Jangaon : పాలకుర్తిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్​ఎస్.. - తెలంగాణ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 9:13 PM IST

Argument between BRS and Congress leaders At Janagama : జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాలతో.. కాంగ్రెస్‌ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​ఛార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన అఖిలపక్ష నాయకులను.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు.. రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ధర్నాకు దిగారు. 

ఆ సమయంలో అక్కడకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు మంత్రికి మద్దతుగా ఆందోళనకు దిగారు. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత పాలకుర్తి నియోజకవర్గ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఝాన్సీరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. పోలీస్‌స్టేషన్లో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఝాన్సీరెడ్డి పోలీసులకు అందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.