పెద్దపల్లిలో అమిత్ షా రోడ్ షో- కార్యకర్తల్లో జోష్ - తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా
🎬 Watch Now: Feature Video
Published : Nov 27, 2023, 6:51 PM IST
Amit Shah Road Show in Peddapalli : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తరుఫున ఆ పార్టీ ఆగ్రనాయకులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి నియోజకవర్గంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో(Amit Shah Road Show) నిర్వహించారు. ఈ నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.
Amit Shah Election Campaign in Peddapalli : రోడ్ షోలో భాగంగా పెద్దపల్లి జెండా కూడలిలో ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసి కార్యకర్తలను హోరెత్తించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.