Ambulance accident Hyderabad : అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న అంబులెన్స్.. డ్రైవర్ మృతి - telangana latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/640-480-19088799-420-19088799-1690262244022.jpg)
Ambulance accident in Hyderabad : ఎవరికైనా ఆపదొస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి వాలుతుంది. ఇలాంటి విషయాల్లో అంబులెన్స్ డ్రైవర్లు చాలా అలర్ట్‌గా ఉంటారు. ఏ రోడ్డు ప్రమాదమో జరిగితే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుంది. కానీ తాజాగా.. అలాంటి అంబులెన్సే రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ బి.ఎన్ రెడ్డి నగర్‌లో ఓ ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు.
వర్షాలు కురుస్తున్న కారణంగా రోడ్లు చిత్తడిగా మారడంతో అతి వేగంతో వస్తున్న అంబులెన్స్ డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. అయితే అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ రాపిడికి ఇంధన ట్యాంక్ నుంచి మంటలు అంటుకోవడంతో క్షణాల్లో వాహనం కాలిపోయింది. అది గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అంబులెన్స్‌లోంచి బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు తీవ్ర గాయాల కారణంగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.