ఐనవోలు మల్లన్న జాతర డ్రోన్ విజువల్స్ మీరెప్పుడైనా చూశారా - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Inavolu Mallanna Temple Drone Visuals : హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం భక్తజనంతో నిండిపోయింది. మకర సంక్రాంతి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో దేవదేవుడు మల్లన్నను దర్శించుకునేందుకు పిల్లాపాపలతో తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎత్తు బోనాలు, శివసత్తుల పూనకాలతో కోరమీసాల మల్లన్న ఆలయం భక్తి పారవస్యంతో దర్శనమిస్తోంది. అందమైన దీపకాంతుల వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతూ కనువిందు చేస్తుంది. భక్తజన సందోహంతో నిండిపోయిన మల్లన్న ఆలయ పరిసరాలు రాత్రివేల ఆధ్యాత్మిక శోభను కళ్లకు కడుతుంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ మీకోసం.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST