thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 12:40 PM IST

Updated : Sep 2, 2023, 1:01 PM IST

ETV Bharat / Videos

Aditya L1 Launch : నింగిలోకి 'ఆదిత్య ఎల్​ 1'.. ప్రయోగం సక్సెస్.. వీడియో చూశారా?

Aditya L1 Launch : సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. తొలిసారిగా చేపడుతున్న ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతమైంది. PSLV-C57 వాహకనౌక ఆదిత్య ఎల్‌1 ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం ఈ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని PSLV-C57 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం పీఎస్‌ఎల్వీ-సీ57 నుంచి విజయవంతంగా ఆదిత్య-ఎల్‌1 విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే కావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Isro Aditya L1 Mission Launch Date : తొలుత ఆదిత్య ఎల్‌-1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్ 1కు చేరుకునేందుకు దీనికి 125 రోజుల సమయం పట్టనుంది. లగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చు. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. 

Last Updated : Sep 2, 2023, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.