ఆదిలాబాద్​ రిమ్స్​లో ఆందోళన - కలెక్టర్​ చొరవతో ధర్నాను విరమించిన జూడాలు - Adilabad RIMS Medical College Students Attack

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 2:00 PM IST

Adilabad RIMS Medical College Students Attacked By Thugs : ఆదిలాబాద్ రిమ్స్‌ వైద్యకళాశాల వద్ద ఉద్రిక్తత వాతవారణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి  కళాశాలలోకి అక్రమంగా చొరబడిన దుండగులు పలువురు విద్యార్థులపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పర ఘర్షణ జరగగా ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రిమ్స్ జూడాలు, మెడికోలు ఆందోళన బాట పట్టారు. ఉదయమే కలెక్టరేట్​కు ర్యాలీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Junior Doctors Allegations On RIMS Director : హస్టల్​లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని డైరెక్టర్​కు విన్నవించాం. ఆయన మా గోడు సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆ తర్వాత కొంతమంది దుండగులు మాపై దాడి చేశారు. వారు డైరెక్టర్​ సాయంతోనే మాపై దాడికి దిగారేమోనని మా అనుమానం. అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఫిర్యాదు స్వీకరించామని దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరోవైపు ఈ ఘటనపై అదనపు కలెక్టర్‌ శ్యామలను విచారణాధికారిగా జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ నియమించారు. ​ ఈ ఘటనపై విచారణ చేపడతామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో​ రిమ్స్​ జూడాలు ఆందోళన విరమించారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.