హీరోయిన్ మధుబాల స్కై డైవింగ్ - 12000 ఫీట్ల ఎత్తులో సూపర్ స్టంట్! - మధుబాల స్కై డైవింగ్ స్టంట్స్
🎬 Watch Now: Feature Video
Published : Nov 4, 2023, 4:29 PM IST
|Updated : Nov 4, 2023, 5:09 PM IST
Actress Madhubala Sky Diving : టాలీవుడ్ సీనియర్ నటి మధుబాల.. న్యూజిలాండ్ టౌపో సరస్సు ప్రాంతంలో స్కై డైవింగ్ చేశారు. ఆమె స్కై డైవింగ్ మాస్టర్‌తో కలిసి.. 12000 ఫీట్ల ఎత్తులో వెళ్తున్న విమానం నుంచి దూకి స్టంట్ చేశారు. ప్యారాచ్యూట్ సహాయంతో ఆమె ఆకాశంలో కాసేపు డైవింగ్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మధుబాలను, మాస్టర్ సేఫ్‌గా నేలపైకి దించారు. అంతకుముందు మధుబాల సేఫ్ సూట్ ధరించి, డైవింగ్ మాస్టర్లతో కలిసి హుషారుగా ఫ్లైట్ ఎక్కారు. విమానం గాల్లోకి ఎగిరాక.. డైవ్ చేసేముందు మధుబాల కొంత ఆందోళనగా కనిపించారు. కానీ, మాస్టర్ సహకారంతో ఆమె.. స్కై డైవింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు.
నటి మధుబాల తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 50 పైగా సినిమాల్లో నటించారు. మణిరత్నం 'రోజా' సినిమాతో ఈమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. ఇక తెలుగులో సూర్య వర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో, శాకుంతలం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మధుబాల రెండు మలయాళ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.