Actor Prabhas visit Tirupathi శ్రీవారి సేవలో హీరో ప్రభాస్.. నేడు తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రీలీజ్ ఈవెంట్ - ఆదిపురుష్ చిత్రం అప్డేట్స్
🎬 Watch Now: Feature Video
Prabhas Visits Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు ప్రభాస్ దర్శించుకున్నారు. తిరుపతిలో నిర్వహించనున్న ఆదిపురుష్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సోమవారం రాత్రి ప్రభాస్ తిరుపతికి చేరుకున్నారు. అయితే శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయమే తిరుమలకు చేరుకున్న ఆయనకు... తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. నటుడు ప్రభాస్ శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ, స్వామి వారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రభాస్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో స్వామి వారి దర్శన సమయంలో ప్రభాస్‌ను గమనించిన ఫ్యాన్స్ .. తమ అభిమాన నటుడికి అభివాదం చేశారు. ఉత్సాహవంతమైన అభిమానుల కేరింతలతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఆదిపురుష్ ప్రీ రీలీజ్ ఈవెంట్ సాయంత్రం 5గంటల నుంచి జరుగుతుందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రామాయణ ఇతివృత్తం ఆధారంగా నిర్మిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఈ నెల 16 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది.