మటన్ బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లు - చితకబాదిన వెయిటర్లు - హోటల్లో వెయిటర్ల దాడి
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 5:13 PM IST
Abids Hotel clash in Hyderabad : హైదరాబాద్ అబిడ్స్‌లో ఓ హోటల్లో బిర్యానీ విషయమై తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నూతన సంవత్సర సందర్భంగా ధూల్‌పేటకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీ సరిగా ఉండకలేదని, తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ సిబ్బందికి చెప్పారు. అయితే దీనికి వారు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. కస్టమర్లు వెయిటర్‌పై దాడి చేయడంతో, సిబ్బంది వినియోగదారులపై కర్రలతో దాడికి దిగారు. ఈ క్రమంలో కొంతమంది వినియోగదారులకు గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
Clash in Abids Hotel over Biryani : బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురు వెయిటర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వెంటనే హోటల్ యజమానిపై అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో హోటల్‌పై దాడి చేస్తామని హెచ్చరించారు. యజమానిని అరెస్టు చేయాలంటూ అబిడ్స్ పీఎస్ ముందు ధూల్‌పేట లోద్ సమాజ్ నాయకులు ఆందోళన చేపట్టారు.