thumbnail

By

Published : Jun 21, 2023, 3:40 PM IST

ETV Bharat / Videos

younger set the bike on fire: తరచూ రిపేరుకొస్తోందని.. కొత్త బైక్​కు నిప్పంటించిన యువకుడు

younger set the bike on fire: ఐదు నెలల కిందట కొన్న తన బైక్ తరచూ మరమ్మతుకు గురవుతోందని, దానిని వెనక్కు తీసుకుని మరో బైక్ ఇవ్వాలని కోరిన యువకుడు.. అందుకు షోరూం యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో అగ్రహించాడు. షోరూం ముందే తన బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. హిందూపురం మండలం ఎం బీరేపల్లి గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు హిందూపురం పట్టణంలోని టీవీఎస్ షోరూంలో ఐదు నెలల కిందట ఒక బైక్  కొనుగోలు చేశాడు. కాగా, బైక్ తరచూ మరమ్మతులకు గురవుతోందని, దాంతో తనకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్తూ.. మార్చి ఇవ్వాలని కోరాడు. షో రూమ్ డీలర్ అందుకు ఒప్పుకోకపోవడంతో గొడవపడిన యువకుడు.. షోరూమ్ ముందు తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ద్విచక్ర వాహనం దగ్ధమవుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు గుమికూడి ఏం జరిగిందో తెలియక వీక్షించారు. షోరూం డీలర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.