Person threatened Bank with fake bomb : డబ్బు కోసం బ్యాంక్‌లో బాంబు బెదిరింపు.. అసలు విషయం తెలిసి అంతా షాక్.! - జీడిమెట్ల ఆదర్శ్బ్యాంక్లో బాంబు బెదిరింపు
🎬 Watch Now: Feature Video
Person threatened Bank with fake bomb in hyderabad : నాణానికి రెండు పార్శ్వాలు ఎలా ఉంటాయో.. నేటికాలంలో పెరిగిన సాంకేతికత ఉపయోగంతో పాటు.. అదే స్థాయిలో దుర్వినియోగానికి పాల్పడుతోంది. సాధారణంగా యూట్యూబ్‌ను వినోదం కోసం చూస్తుంటాం. కొందరు అర్థిక స్తోమత లేని విద్యార్థులు.. యూట్యూబ్‌లో ఎడ్యుటెక్ వీడియోలను చూసి ఉద్యోగాలు పొందిన సందర్భాలున్నాయి. కానీ ఇతడు మాత్రం ఈజీ మనీ కోసం యూట్యూబ్‌లో బాంబు తయారీ వీడియో చూసి.. బ్యాంక్‌లో డబ్బు ఇవ్వాలంటూ హల్చల్ చేశాడు.
ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ఆదర్శ్ బ్యాంకులో చోటు చేసుకుంది. తన శరీరానికి బాంబు లాంటి సర్క్యూట్ బోర్డు పరికరం అమర్చుకుని.. బ్యాంక్‌లో డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. లేకపోతే బాంబ్ పేల్చి.. బ్యాంక్‌ని నేలమట్టం చేస్తానని హల్చల్ చేశాడు. ఇది గమనించిన స్థానికులు.. జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించచగా అసలు విషయం బయటపడింది. బాంబులాంటి పరికరాలు ఏవి లేవని తేల్చిన పోలీసులు.. ఈజీ మనీ కోసం యూట్యూబ్‌లో చూసి చెరుకు గడలకు రెడ్ టేపు చుట్టుకుని ఈ పని చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని శివాజీ(32)గా గుర్తించారు.