మద్యం మత్తులో పాముతో స్టంట్స్.. పెదవిపై కాటేయగానే.. - పాము కాటుకు గురైవ వ్యక్తి
🎬 Watch Now: Feature Video

సరదాగా కుక్కలతో, పిల్లులతో ఆడతాం. కానీ ఒక వ్యక్తి ఏకంగా విషపూరితమైన పాముతో వినోదం కోసం ఆడి ప్రాణాలు కోల్పోయాడు. బిహార్లోని సివాన్లో మద్యం మత్తులో ఓ యువకుడు తాచుపామును పట్టుకుని.. ఊరి జనం చూస్తున్నారని వింత విన్యాసాలు చేశాడు. కొన్నిసార్లు పామును నోట్లో, భుజాలపై పెట్టుకొని ఆడాడు. తిత్రా హరిజన్ తోలా ప్రాంతానికి చెందిన ఇంద్రజీత్ అనే వ్యక్తి.. మద్యం మత్తులో చేస్తున్న విన్యాసాలను స్థానికులు ఒకింత భయంతో అలానే గుమిగూడి చూశారు. మూడు, నాలుగు సార్లు నోట్లో పెట్టుకొని తీస్తుండగా పాము పెదవిపై కాటేసింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. గ్రామస్థులు అతడిని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఇంద్రజీత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.