A Electricity Worker Swims in Flood to Restore Current : శభాష్​​ శ్రీకాంత్.. వాగులో ఈదుకుంటూ వెళ్లి.. ఊరికి వెలుగులు అందించి.. - Electric Helper Repair Current Wire Swimming pond

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 30, 2023, 6:43 PM IST

A Electricity Worker Swims in Flood to Restore Current at Mahabubabad : ఆ ప్రాంతంలో భారీ వర్షానికి వరద పొటెత్తింది. ఈ క్రమంలోనే వాగు ఉప్పొంగి ప్రవసిస్తుంది. కానీ అందులో నుంచి ఊరికి కరెంట్ సరఫరా అయ్యే విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయి. అదే ప్రాంతంలో మరమ్మతు తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి ప్రాణాలను పణంగా పెట్టి.. వాగులో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్‌ను పునరుద్ధరించి.. అందరితో శభాష్‌ అని అనిపించుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామానికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 

ఈ సమస్యకు గల కారణాలను వెతుకుతుడంగా బూర్క వాగులో ఉన్న కరెంట్ స్తంభంపై సాంకేతికలోపం ఏర్పడిందని.. విద్యుత్ శాఖ ఉద్యోగి శ్రీకాంత్ గుర్తించాడు. వెంటనే ఆయన వాగులో ఈదుకుంటూ వెళ్లాడు. వరద ప్రవాహాన్ని లెక్కచేయకుండా స్తంభంపైకి ఎక్కి మరమ్మతు చేసి.. అప్పటికప్పుడు పొగుళ్లపల్లి గ్రామానికి కరెంట్ సరఫరా అయ్యేలా చేశాడు. మరోవైపు శ్రీకాంత్ చేసిన సాహసాన్ని సీఎండీ గోపాల్‌రావు, విద్యుత్ ఉద్యోగులు, స్థానికులు అభినందించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.