ఇంతటి విజయాన్ని ఊహించలేదు - ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోను : డైరెక్టర్ ఆదిత్య హాసన్ - 90s Web Series Director Interview
🎬 Watch Now: Feature Video
Published : Jan 16, 2024, 4:05 PM IST
90s Web Series Director Interview : మధ్య తరగతికి చెందిన ఆ యువకుడు ఓ కల కన్నాడు. ఆ కలను సాకారం చేసుకునేందుకు తనలోని కళనే ఆయుధంగా చేసుకొని సినీ ప్రంపంచం వైపు అడుగులేశాడు. తన సినీ ప్రయాణంలో అద్భుత విజయాన్ని అందుకున్నాడు ఆ యువ దర్శకుడు. తనే #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్. తన కథనే 90వ దశకంతో ముడిపెట్టి తీసిన వెబ్ సిరీస్ అశేష జనవాహినిని అలరిస్తోంది.
90s Web Series Director Aditya Hasan Story : సామాన్య మధ్య తరగతి నేపథ్యంతో కూడిన 90s వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటోంది. ఈ విజయంలో కుటుంబం, స్నేహితులు, వెబ్‌సిరీస్ కాస్ట్ అండ్ క్రూ అందించిన సహకారం మరువలేనిదంటున్నాడు ఆ యువకుడు. తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు, చూసినవే సినిమా తీసేందుకు ప్రేరిపితం అయ్యాయని చెబుతున్నాడు. మరి ఈ అనూహ్య విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న దర్శకుడు ఆదిత్య హాసన్ తన ప్రయాణాన్ని ఎలా సాగించారో ఇప్పుడు తెలుసుకుందాం.