MS Dhoni Cutout: ధోనీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. 77 అడుగుల భారీ కటౌట్.. ఎక్కడంటే..? - మహేంద్ర సింగ్ ధోని
🎬 Watch Now: Feature Video
MS Dhoni Cutout at Nandigama: భారత్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై.. అతని అభిమానులు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సారి ధోనీ ఫ్యాన్స్.. అతనిపై అభిమానాన్ని 77 అడుగుల భారీ కటౌట్ రూపంలో చూపించారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేటలో భారత్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. ధోనీ జన్మదిన వేడుకల్లో భాగంగా 77 అడుగుల ఎత్తు కటౌట్‌ను అంబారుపేట గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో సుమారు 44 అడుగుల ఎత్తులో ధోనీ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఈసారి 100 అడుగుల ఎత్తులో కటౌట్ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ.. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని 77 అడుగులే ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులకు ధోనీ భారీ కటౌట్‌ను ఆసక్తిగా చూస్తున్నారు.