ఇండియా డెజర్ట్‌లో నోరూరించే 500 రకాల స్వీట్లు - 500 రకాల భారతీయ మిఠాయిలు
🎬 Watch Now: Feature Video


Published : Dec 28, 2023, 1:48 PM IST
500 Types Of Indian Sweets in Hyderabad : హైదరాబాద్ బేగంపేటలోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని భారీ స్థాయిలో స్వీట్స్‌ను తయారు చేసింది. ఒకే వేదికపై 500కుపైగా నోరూరించే భారతీయ మిఠాయిలను ప్రదర్శించి ఔరా అనిపించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమైన తీపి వంటకాలను సిద్ధం చేసింది.
500 రకాల భారతీయ స్వీట్లను ఒకే వేదికపై ఇండియా డెజర్ట్ పేరుతో ప్రదర్శించింది కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా. స్వీట్ షాపుల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, నిపుణుల సహకారం తీసుకున్నట్లు అకాడమీ చెఫ్ అక్షయ్ కులకర్ణి తెలిపారు. 350 మంది విద్యార్థులు, పాకశాస్త్ర నిపుణులు 72 గంటలు శ్రమించి తయారు చేశారని చెప్పారు. ప్రతీ ఏటా ఒక ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నించే కలినరీ అకాడమీ ఇప్పటి వరకు ఆరు ప్రపంచ రికార్డులు దక్కించుకుందని వెల్లడించారు. ఈ ప్రదర్శనతో ఏడో ప్రపంచ రికార్డు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.