'కాగజ్​నగర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్​పై అవిశ్వాస తీర్మానం'

🎬 Watch Now: Feature Video

thumbnail

24 Councilors Voted No Confidence Motion In Asifabad District : కాగజ్​నగర్ నుంచి బుధవారం ఉదయం 24 మంది మహిళలు, పురుష కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఛైర్మన్, వైస్ ఛైర్మన్​పై అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ కుమార్​కు అందించారు. గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా తమ సమస్యలపై స్పందించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సమావేశాలలో కూడా ఒంటెద్దు పోకడలకు పోవడం, ఏ ఒక్కరికి గౌరవం ఇవ్వకపోవడం, తాము చెప్పిన మాట వినిపించుకోకపోవడం ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని కౌన్సిలర్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా వేచి చూసి మారకపోవడంతో విసుగు చెంది ఏకతాటిపై వచ్చి, వారిపై అవిశ్వాస తీర్మానాన్ని డీఆర్ఓకు అందించామని చెప్పారు.

Argument Between Councilors And Chairman In Asifabad : అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించే సమయంలో డీఆర్ఓ కార్యాలయం ముందు ఛైర్మన్ సద్దాం హుస్సేన్​కు మిగతా కౌన్సిలర్లకు కొంత మాట పెరిగింది. ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అనుచరుడు డీఆర్ఓ గది లోపలికి రావడంతో కొంత గందరగోళం ఏర్పడింది. వెంటనే కొంతమంది కౌన్సిలర్లు అతడిని బయటికి పంపించేశారు. అనంతరం మిగతా కౌన్సిలర్లు తీర్మాన పత్రాన్ని డీఆర్ఓకు అందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.