ఓటు విషయంలో తగ్గేదేలే అంటోన్న వందేళ్ల బామ్మ - ఈమెను చూసైనా - Adilabad annapurna news
🎬 Watch Now: Feature Video
Published : Nov 18, 2023, 12:25 PM IST
104 Year Old Woman to Vote in Telangana Elections 2023 : ఓటు.. హాఁ.. ఈ ఒక్కసారి వేయకుంటే ఏం అవుతుందిలే అనుకునే వారు చాలా మందే ఉంటారు. నేను వేసే ఒక్క ఓటు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేస్తుందా ఏంటి అని నిట్టూర్చే వారూ లేకపోలేదు. కానీ వందేళ్ల వయసులోనూ.. తన బాధ్యతను నిర్వర్తించడంలో తగ్గేదే లే అంటోంది ఓ బామ్మ. ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుని గ్రామస్థులతో పాటు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురానా బజార్‌కు చెందిన 104 ఏళ్ల చివాటే అన్నపూర్ణ బాయి.
Home Voting in Telangana Assembly Elections : 1957 నుంచి మొదలుకొని.. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో తన ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ బామ్మ నడవలేని పరిస్థితుల్లో ఉన్నా.. రాష్ట్రంలో తొలిసారి అందుబాటులోకి వచ్చిన హోమ్ ఓటింగ్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు సైతం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వయసులోనూ ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న ఈ బామ్మను చూసి మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.