Volcano Eruption today: లావా ప్రవాహానికి మిగిలింది ఓకే ఒక్క ఇల్లు.. - లా పాల్మా
🎬 Watch Now: Feature Video
స్పెయిన్‌లోని (Spain volcano eruption 2021) లా పాల్మా దీవిలో విస్ఫోటం (Volcano Eruption today) చెందిన అగ్నిపర్వతం (la palma volcano) నుంచి లావా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. లావా ప్రవాహం ధాటికి దీవిలోని ఇళ్లన్నీ ఆహుతయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మిగిలిన ఉన్న ఒకే ఒక ఇల్లు.. ప్రకృతి సృష్టించిన విపత్తుకు ప్రతీకగా నిలిచింది. అంతర్గత భూకంపం సంభవించిన తర్వాత గతవారం రోజుల నుంచి లావా విస్ఫోటం చెందుతూనే ఉంది. 85 వేల మంది ఉన్న లా పాల్మా దీవిలో లావా ప్రభావంతో 400 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లావా 450 ఎకరాల మేర విస్తరించిందని తెలిపిన అధికారులు.. 14 కిలోమీటర్ల రోడ్డును పూర్తిగా మూసివేసిందని వివరించారు.