పోర్చుగల్ 'బతుకమ్మ పండుగ' గురించి తెలుసా? - తెలంగాణా
🎬 Watch Now: Feature Video
తెలంగాణలో ఏటా ఘనంగా జరిగే 'బతుకమ్మ' లాంటి పండగనే పోర్చుగల్లోనూ జరుపుకుంటారు. పోర్చుగీసులోని టోమర్ నగరంలో నాలుగేళ్లకోసారి ఈ సంప్రదాయ 'ట్రేస్ ఫెస్టివల్' నిర్వహిస్తారు. తలపై రకరకాల పూలతో అలంకరించిన 16 కిలోల బరువుండే పూల బుట్టలు పెట్టుకొని దాదాపు 5 కిలోమీటర్లు నడుస్తారు. ఈ సంవత్సరం జరిగిన ఉత్సవాల్లో 748 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది పర్యటకులు టోమర్ నగరానికి తరలివచ్చారు. ఆ దృశ్యాలు మీకోసం....