కరోనా ధాటికి నిర్మానుష్యంగా మారిన ఇటలీ - italy corona deaths
🎬 Watch Now: Feature Video
ఇటలీలో కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వైరస్ నియంత్రణ క్రమంలో పార్కులు, దుకాణాలను మూసేసింది ప్రభుత్వం. ఫలితంగా రోమ్ నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నగరంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రధాన వీధులు ఎడారిని తలపించాయి. నిత్యం ఆటగాళ్లతో కనిపించే ఒలింపిక్ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలు.. ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా ధాటికి ఇటలీలో 6,077 మంది మరణించారు.