నిరసనలతో దద్దరిల్లిన సుడాన్ వీధులు
🎬 Watch Now: Feature Video
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో నిరసనలు (sudan protest 2021) మిన్నంటాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. సైన్యంతో జరిగిన ఒప్పంద పత్రంపై ఆ దేశ ప్రధానమంత్రి అబ్దుల్లా హామ్డాక్ సంతకం చేసిన నేపథ్యంలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. పౌరప్రభుత్వానికి అధికారం అప్పగించాలని ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఈ తరుణంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. సుడాన్లో గత నెల రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని దించేసి సైన్యం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి సూడాన్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ అధికారులు, నాయకులను సైన్యం బంధించింది. తాజాగా జరిగిన ఒప్పందంతో వారిని విడుదల చేసింది.