సూడాన్‌లో నిరసనలు ఉద్రిక్తం.. ఆరుగురు మృతి
🎬 Watch Now: Feature Video
సూడాన్‌లో పౌర ప్రభుత్వం ఏర్పాటు కోసం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. సోమవారం రాత్రి ఆ దేశ రాజధాని ఖార్టూమ్‌లో చేపట్టిన 'సిట్-ఇన్ సైట్' కార్యక్రమం రక్తసిక్తమైంది. ఒక సైనిక అధికారి సహా ఆరుగురు మృతి చెందారు. మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌కు విశ్వసనీయులైన కొంత మంది భద్రతా సిబ్బంది ఈ హింసాకాండకు పాల్పడ్డారని ఆందోళనకారులు ఆరోపించారు. ఇటీవలే సూడాన్‌లో సైనిక తిరుగుబాటుతో మాజీ అధ్యక్షుడు బషీర్ 30 ఏళ్ల నిరంకుశ పాలనకు తెరపడింది.