మంచు ముసుగులో బెల్జియం రాజధాని - బెల్జియం రాజధానిలో భారీ హిమపాతం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11315971-thumbnail-3x2-bel.jpg)
భారత్లో గ్రీష్మఋతువుతో ఎండలు మండిపోతుంటే.. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ మాత్రం మంచు ముసుగులో ఒదిగిపోయింది. కొద్దిరోజులుగా కురుస్తున్న హిమపాతంతో నగరంలో ఎటు చూసినా శ్వేతవర్ణమే దర్శనమిస్తోంది. ఇళ్లు, కార్యాలయాలు తెల్లగా ప్రకాశిస్తున్నాయి. పెద్దఎత్తున మంచు.. రహదారుల మీద పేరుకుపోయింది. స్థానిక పార్కుల్లో భారీగా పోగుపడిన మంచుతో చిన్నారులు ఆటలాడుతున్నారు. తెల్లని మంచుతో పిట్టగొడలు కడుతూ కేరింతలు కొడుతున్నారు.