మాస్క్ ధరించమన్నందుకు డ్రైవర్‌తో గొడవ - అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో మాస్క్ ధరించాలని అడిగిన డ్రైవర్‌పై ఆగ్రహించిన మహిళలు
🎬 Watch Now: Feature Video
మాస్క్ ధరించాలని అభ్యర్థించిన డ్రైవర్‌పై ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించిన ఘటన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో జరిగింది. నేపాల్ నుంచి వలస వెళ్లిన సుభాకర్ ఖేడ్కా శాన్ఫ్రాన్సిస్కోలో ఊబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కారులోకి ముగ్గురు మహిళలు ఎక్కారు. మాస్క్ ధరించాలని ఖేడ్కా అభ్యర్థించారు. అందుకు నిరాకరించిన మహిళలు ఆయనపై పరుష పదజాలంతో దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న ఆయన సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనపై పెప్పర్ స్ప్రే చేశారని డ్రైవర్ ఆరోపిస్తున్నారు. తను నేపాలీ వాసినైనందుకే సదరు మహిళలు అలా ప్రవర్తించారని అంటున్నాడు. ఈ ఘటన తర్వాత మహిళలు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.