నీరు, గాలి, నేలపై 'రష్యా' అణు యుద్ధ విన్యాసాలు! - Russia army drills
🎬 Watch Now: Feature Video
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని రష్యన్ సైన్యం.. నేల, నీరు, గాలిలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. 12వేల మంది సైనికులు, 213 క్షిపణి ప్రయోగాలు, 105 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 15 యుద్ధ నౌకలతో పాటు అయిదు అణు జలాంతర్గాములను ఈ విన్యాసాల్లో భాగం చేసింది. బారెట్స్, కాస్పియన్ సముద్రాల నుంచి కాలిబర్ క్రూస్ క్షిపణులను ప్రయోగించింది రష్యన్ ఆర్మీ. అలాగే భూమిపై నుంచి ప్రయోగించే ఇస్కాందర్ క్రూస్ క్షిపణిని దక్షిణ, తూర్పు జిల్లాల్లోని మిలిటరీ ఫైరింగ్ రేంజ్ నుంచి ప్రయోగించింది. అణు యుద్ధానికి సమాయత్తంలో భాగంగా ఈ విన్యాసాలు చేపట్టింది రష్యా సైన్యం.
Last Updated : Oct 18, 2019, 12:27 PM IST