పెరూ 'క్లౌన్స్ డే'లో ఆకట్టుకున్న జోకర్ పొట్టోళ్లు - clowns
🎬 Watch Now: Feature Video
పెరూ రాజధాని లిమాలో 'పెరూవియన్ క్లౌన్స్ డే' వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రంగు రంగుల వస్త్రాలు, విగ్గులు, ముఖానికి రంగులతో వందలాది మంది లిమా నగర వీధుల్లో నృత్యాలు చేశారు. 1987లో మరణించిన ప్రముఖ పెరూవియన్ విదూషకుడు (క్లౌన్), 'టోనీ పెరేజిల్'గా పేరుగాంచిన జోస్ ఆల్వేరేజ్ వెలేజ్ గౌరవార్థం ప్రతి ఏటా మే 25న ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. విదూషకులు, సర్కస్ ప్రదర్శకుల సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 2006 నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.