జపాన్‌లో కార్చిచ్చు- జోరుగా సహాయక చర్యలు - Forest fire in japan
🎬 Watch Now: Feature Video

జపాన్‌లో సంభవించిన కార్చిచ్చును అదుపు చేసేందుకు అధికారులు నాలుగు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను చల్లార్చేందుకు రక్షణ రంగానికి చెందిన హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు. దీంతో బుధవారం పెద్దఎత్తున పొగ కమ్మేసింది. అగ్ని కీలలు విజృంభిస్తున్న దృష్ట్యా.. ఆషికాగా నగరంలోని 72 ఇళ్ల వారిని ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. తోచిగి ప్రిఫెక్చర్‌లోని పర్వతాల్లో ఈ మంటలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది.