ఇండోనేసియాలో వరద బీభత్సం- 16 మంది మృతి - Indonesia floods
🎬 Watch Now: Feature Video
ఇండోనేసియాలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా దక్షిణ సులవేసి రాష్ట్రంలో 16 మంది చనిపోయారు. మరో 23 మంది గల్లంతయ్యారు. వరదలో కొట్టుకు వచ్చిన బురద... రహదారులు, జనావాసాల మధ్య చేరింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి మూడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తర లువూ పరిధిలో సుమారు 4 వేల మంది వరదల కారణంగా ప్రభావితమయ్యారు.