తొలిసారి ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీ గగన విహారం - ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీ వీడియో
🎬 Watch Now: Feature Video
జర్మన్ సంస్థ వోలోకాప్టర్ తన ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీని తొలిసారిగా ఫ్రాన్స్‌లో నడిపింది. ఫ్రాన్స్‌లోని లీ బౌర్గెట్ విమానాశ్రయంలో ఎయిర్ ట్యాక్సీ గాలిలో విహరించింది. చిన్నసైజు హెలికాఫ్టర్‌లా ఉండే ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ.. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో 500 మీటర్ల దూరం ప్రయాణించినట్లు వోలోకాప్టర్ వెల్లడించింది. ఇది భూమి నుంచి 30 మీటర్ల ఎత్తులో మూడు నిమిషాల పాటు ప్రయాణించినట్లు ప్రకటనలో తెలిపింది. ఫ్రాన్స్‌లో 2024లో జరిగే ఒలింపిక్స్‌లో వీటి ద్వారా సేవలు అందించాలని వోలోకాప్టర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.