viral: అడవిలో హాయిగా సేద తీరుతున్న ఏనుగులు
🎬 Watch Now: Feature Video
చైనాలో ఓ ఏనుగుల గుంపు చేష్టలు నెట్టింట వైరల్‌గా మారాయి. యూన్నాన్ రాష్ట్రంలోని షువాంగ్బన్న నేషనల్ నేచర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఏనుగుల గుంపు దక్షిణ దిశగా ప్రయాణిస్తోంది. పంట పొలాల్లో దొరికే గోధుమ, అరటి వంటి ఆహారాన్ని తింటున్నాయి. తాజాగా నాన్శాన్ గ్రామంలోకి ప్రవేశిస్తున్న ఏనుగుల గుంపును డ్రోన్ కెమరాలు గుర్తించాయి. రోజూ దాదాపు 20 కి.మీ ప్రయాణం చేస్తూ మధ్యలో అలసి నిద్రిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. పిల్ల ఏనుగులు నిద్రిస్తున్న తల్లి ఏనుగుల మధ్య ఆటలాడుతున్న దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి. అధికారులు ఆ ఏనుగుల గుంపును మళ్లీ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.