ఈఫిల్ టవర్‌కు సరికొత్త వెలుగులు - boat energy observer eo dev
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11904019-thumbnail-3x2-111.jpg)
చరిత్రలో మొదటిసారిగా పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్.. సరికొత్త వెలుగులతో ప్రకాశించింది. పునురుత్పాదక హైడ్రోజన్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ సాయంతో ఇక్కడి దీపాలను మంగళవారం వెలిగించటమే ఇందుకు కారణం. ఉద్గారాలను వెలువరించని ఈ విద్యుత్ హైడ్రోజన్‌ను బోట్ ఎనర్జీ అబ్జర్వర్‌కు చెందిన ఈవోదేవ్ అనే సంస్థ తయారు చేసింది. ఈ హైడ్రోజన్ విద్యుత్‌ను వాడకాన్ని కొనసాగిస్తే.. 2050 నాటికి గ్రీన్హౌస్ ఉద్గారాలను 20 శాతం వరకు తగ్గించవచ్చని ఎనర్జీ అబ్జర్వర్ వ్యవస్థాపకుడు విక్టోరియన్ ఎరస్సర్డ్ పేర్కొన్నారు.