thumbnail

జేబులో ఫోన్​తో జూడో ఫైట్- తర్వాత ఏమైంది?

By

Published : May 12, 2019, 10:45 AM IST

Updated : May 12, 2019, 1:01 PM IST

అంతర్జాతీయ పోటీ అంటే ఎంతో జాగ్రత్తగా బరిలో దిగాల్సి ఉంటుంది. కానీ ఓ క్రీడాకారుడి నిర్లక్ష్యంతో ఆట నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అజెర్​బైజాన్​ దేశంలో జరిగిన 'బాకు గ్రాండ్​స్లామ్​ ప్రపంచ జూడో టూర్​-2019' లో ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించే ఘటన జరిగింది. 81 కిలోల విభాగంలో జూడో పోటీ జరుగుతున్న సమయంలో పోర్చుగల్​కు చెందిన క్రీడాకారుడు అన్రి ఎగుటిడ్జ్​ జేబులోంచి ఫోన్​ కింద పడింది. గమనించిన నిర్వాహకులు వెంటనే పోటీని నిలిపేశారు. అతనిపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : May 12, 2019, 1:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.